Abn logo
Nov 12 2020 @ 07:14AM

ఓ వ్యక్తి మృతికి కారణమైన టీఆర్ఎస్ లీడర్‌

Kaakateeya

హైదరాబాద్ : సంబంధంలేని విషయంలో తలదూర్చి అందరినీ దూషించడమే కాకుండా ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు కుషాయిగూడకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటికి రావడంతో పరారయ్యాడు. బుధవారం చక్రిపురం రెడ్డికాలనీలో చోటు చేసుకున్న సంఘటన ఇది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్‌లో నివసించే దాసరి వెంకట్‌రెడ్డి(41) చక్రిపురం రెడ్డికాలనీలో కొనుగోలు చేసిన ప్లాటు వద్ద ఈ నెల 8న ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తున్నాడు. ఈలోగా అదే కాలనీలో నివసించే టీఆర్‌ఎస్‌ నాయకుడు చింతల బుచ్చిరెడ్డి అక్కడకు వచ్చాడు. వెంకట్‌రెడ్డిని దూషిస్తూ చేయి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు తెలియకుండా ఇంటి నిర్మాణం ఎలా చేస్తారో చూస్తానని హల్‌చల్‌ చేశాడు. ప్లాటు విక్రయించిన వారిని, మధ్యవర్తులను కూడా దూషిస్తూ బెదిరించాడు. మనస్తాపానికి గురైన వెంకట్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అరగంటలోనే చనిపోయాడు. అదేరోజు మృతుడి కొడుకు శశివర్ధన్‌ ఇచ్చిన ఫిర్యాదును కొందరు పెద్ద మనుషులు వెనక్కి తీసుకునేలా ఒప్పించారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారం పంచాయతీకి పెద్ద మనుషులంతా గొడవ జరిగిన ప్లాటు వద్దకే వచ్చారు. అయితే, బుచ్చిరెడ్డి కానీ అతడి వెంట ఉన్న వ్యక్తులు ఎవరూ అక్కడకు రాకపోవడంతో మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకొని వారిని స్టేషన్‌కు తరలించారు. ఇంత జరిగినా సదరు టీఆర్‌ఎస్‌ నాయకుడు బుచ్చిరెడ్డి పత్తా లేకుండా పోవడం కొసమెరుపు. కాగా తమను కూడా అంతు చూస్తానంటూ బుచ్చిరెడ్డి బెదిరించాడని సదరు ప్లాటు విక్రయించిన వ్యక్తి ఎలిమినేటి ఇంద్రారెడ్డి, మధ్యవర్తి డాకా శ్రీనివాసరెడ్డిలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Advertisement
Advertisement