Abn logo
Jun 7 2020 @ 09:25AM

ర‌జ‌నీకాంత్ కింగ్‌లా ఉండాలి.. కింగ్ మేక‌ర్ కాకూడ‌దు: ఖుష్బూ

తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన న‌టి ఖుష్బూ. ప్ర‌స్తుతం ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రీసెంట్‌గా ఈమె త‌న స‌హ న‌టులైన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. క‌రుణానిధి, జ‌య‌ల‌లిత మ‌ర‌ణాలు త‌ర్వాత త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో లోటు ఏర్ప‌డింద‌ని ఖుష్బూ తెలిపారు. ‘‘ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లో కింగ్ కావాలి... కింగ్ మేక‌ర్ కాదు. అప్పుడే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారు. ప్ర‌జ‌లు, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయ‌న మ‌న‌సులో ఎలాంటి ఆలోచ‌న‌లు ఉన్నాయో ఎవ‌రికీ తెలియ‌దు. త్వ‌ర‌లోనే ఆయ‌న త‌న రాజ‌కీయ పార్టీని ప్రారంభిస్తార‌ని ఆశిస్తున్నాను. అలాగే క‌మ‌ల్‌హాస‌న్ కూడా గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బాగానే రాణించారు. ఎన్నిక‌లు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. యువ న‌టీన‌టులు కూడా రాజ‌కీయాల్లోకి రావాలి. వారిని ప్రోత్సహిస్తే ముందుకు వ‌స్తారు’’ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement