కుటజ ఘనవటి

ABN , First Publish Date - 2021-03-30T05:43:38+05:30 IST

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో అతిసారానికి ఉపయోగించే మూలికలలో కుటజ ముఖ్యమైనది. కుటజతో కలిపి తయారుచేసిన అనేక ఔషధాలు వాడుకలో ఉన్నాయి. వాటిలో కుటజ ఘనవటి ఒకటి. కుటజ ఘనవటి తయారీ, ఉపయోగాల గురించి సిద్ధయోగ

కుటజ ఘనవటి

భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో అతిసారానికి ఉపయోగించే మూలికలలో కుటజ ముఖ్యమైనది. కుటజతో కలిపి తయారుచేసిన అనేక ఔషధాలు వాడుకలో ఉన్నాయి. వాటిలో కుటజ ఘనవటి ఒకటి. కుటజ ఘనవటి తయారీ, ఉపయోగాల గురించి సిద్ధయోగ సంగ్రహ గ్రంధంలో చెప్పబడింది.

కుటజ ఘనవటిని కుటజ, అతివస మూలికల సంకలనంతో తయారుచేస్తారు. కుటజ చెట్టు రసం తీసి, కషాయం కాస్తారు. అది చిక్కబడిన తర్వాత అతివస కలిపి మాత్రలుగా తయారుచేస్తారు. కుటజను తెలుగులో కోడిశ చెట్టు అంటారు. సంస్కృతంలో వాత్సక, గిరిమల్లి అనే పేర్లు ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం హోలర్హినా యాంటీడైసెంటీరికా. ఔషధాలలో ఎక్కువగా వేరు, గింజలు, బెరడు ఉపయోగిస్తారు. 

అతిసారం, గ్రహిణి చికిత్సలలో ఈ ఔషధం విశేషంగా పనిచేస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే పలుచగా విరేచనం అయ్యే సమస్యల్లో (ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌) ఈ ఔషధం ఉత్తమంగా పనిచేస్తుంది. రక్తాతిసారం... అంటే విరేచనం పలుచగా అవుతూ, దాన్లో రక్తం పోయే సమస్యకు కూడా విశేషంగా పనిచేస్తుంది. మహిళలకు నెలసరిలో ఎక్కువగా రక్తస్రావం ఓవర్‌ బ్లీడింగ్‌ సమస్యకు ఈ ఔషధంతో ఉపశమనం దక్కుతుంది. 

ఉపయోగించే మోతాదు: పెద్దలు రెండు మాత్రలు, పిల్లలకు ఒక మాత్ర భోజనం తర్వాత తీసుకోవాలి. లైదా వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. ఈ ఔషధాన్ని బైద్యనాధ్‌ సంస్థ తయారుచేస్తుంది. దూత్‌పాపేశ్వర్‌ కంపెనీవాళ్లు  కొన్ని మార్పులతో ఇదే ఔషధాన్ని కుటజపర్పటి అనే పేరుతో తయారు చేస్తున్నారు.

శశిధర్‌, అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,సనాతన జీవన్‌ ట్రస్ట్‌,కొత్తపేట, చీరాల.

Updated Date - 2021-03-30T05:43:38+05:30 IST