Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైట్ విమానాశ్రయం తెరుచుకునేది అప్పుడేనట

కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రంజాన్ సీజన్ కంటే ముందే 10 లక్షల మందికి టీకా ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఇక వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కువైట్ విమానాశ్రయాన్ని మూసి ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, దేశ పౌరులు, నివాసితులకు వ్యాక్సినేషన్ పూర్తైన వెంటనే ఎయిర్‌పోర్టును తెరిచే యోచనలో అధికారులు ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే జూలై నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసిందని మీడియా పేర్కొంది. అందుకే ఆరోగ్యశాఖ వీలైనంత త్వరగా టీకా ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా భారీగా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో కువైట్ వివిధ కంపెనీల టీకాలను కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తోంది.   

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement