Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడాదికి సగటున Kuwait ఎంతమంది ఎయిడ్స్ బాధిత ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తుందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ గత కొంతకాలంగా వలసదారుల పట్ల కఠినంగా వ్యవహిరిస్తున్న విషయం తెలిసిందే. ఉల్లంఘనలు, ఇతర పాలసీల పేరుతో భారీ మొత్తంలో ప్రవాసులను దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇక అక్కడ వలసదారులకు హెల్త్ ఇన్సూరెన్సీ పాలసీ కూడా తప్పనిసరి. దీనిలో భాగంగా ప్రవాసులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో వారికి ఎయిడ్స్‌తో పాటు ఇతర అంటు వ్యాధి ఉన్నట్లు తేలితే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇలా ప్రతియేటా వందల సంఖ్యలో వలసదారులు కువైత్ నుంచి స్వదేశానికి వచ్చేస్తుంటారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం కువైత్ గడిచిన 10 ఏళ్లలో ఏకంగా 20వేలకు పైగా మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది. 2010 నుంచి 2019 వరకు వివిధ వ్యాధుల పేరుతో 23,733 మంది వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టింది కువైత్. 

వీరిలో 2,111 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. అంటే ఏడాదికి సగటున 211 మందిని ఎయిడ్స్ పేరిట దేశం నుంచి బహిష్కరించింది. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే సందర్భంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఎయిడ్స్ తర్వాత అత్యాధికులు మలేరియా, ఫైలేరియా, క్షయ, హెపటైటిస్ బి మరియు సి కారణంగా కువైత్‌ను విడిచినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది వారీగా ప్రవాసుల దేశ బహిష్కరణ జాబితాను పరిశీలిస్తే.. 2019లో 2,355 మంది, 2018లో 2,468 మంది, 2017లో 2,931 మంది, 2016లో 2,470 మంది, 2015లో 2,847 మంది, 2014 లో 2,724 మంది, 2013లో 2,360 మంది, 2012లో 1,921 మంది, 2011లో 1,843 మంది, 2010లో 1,814 మంది ఉన్నారు.      

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement