Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్క్ పర్మిట్ల ట్రాన్స్‌ఫర్‌పై కువైట్ కీలక నిర్ణయం!

కువైట్ సిటీ: వర్క్ పర్మిట్ల ట్రాన్స్‌ఫర్‌ విషయమై కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల వర్క్ పర్మిట్ల ట్రాన్స్‌ఫర్ వ్యవధిని కుదించింది. కార్మికులు తమ వర్క్ పర్మిట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఇకపై మూడేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఏడాదిలో వర్క్ పర్మిట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు పీఏఎం డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా కీలక ప్రకటన చేశారు. అయితే, కార్మికులు తమ వర్క్ పర్మిట్ల ట్రాన్స్‌ఫర్‌కు ఇంతకుముందు పనిచేసిన యజమాని ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు.


వర్క్ పర్మిట్ పొంది ఏడాది పూర్తైన తర్వాత మాజీ యజమాని అనుమతితో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని అహ్మద్ అల్ మౌసా వెల్లడించారు. కార్మిక శాఖ జాబితాలో చేర్చబడిన యజమానులకు కార్మికుల అనుమతులను బదిలీ చేసే నిర్ణయం ఇచ్చినట్లు ఆయన తన ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా గతేడాది కాలంగా కార్మికుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ కార్మికశాఖ వెల్లడించింది. ప్రయాణాలపై ఆంక్షలు, లాక్‌డౌన్ కారణంగా వేలాది మంది కార్మికులు విదేశాల్లోనే చిక్కుకోవడంతో కువైట్‌కు వర్కర్ల కొరత ఏర్పడింది. కొంతమంది కార్మికులు రెసిడెన్సీ పర్మిట్ల గడువు ముగిసిన రెన్యూవ్ చేసుకోలేదు. అలాగే ఇటీవల కువైట్ తీసుకొచ్చిన కఠినమైన రెసిడెన్సీ నిబంధనలు కూడా కార్మికుల కొరతకు కారణమైనట్లు కార్మికశాఖ అధికారులు తెలిపారు.   

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement