కూతురి చికిత్స కోసం సాయం కోరుతున్న భార‌త దంప‌తులు

ABN , First Publish Date - 2020-08-30T16:59:12+05:30 IST

అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌మ ఆరు నెల‌ల కూతురి ఆపరేష‌న్ కోసం ఆర్థికంగా స‌హాయం చేయాలంటూ కువైట్‌లోని భార‌తీయ దంప‌తులు వేడుకుంటున్నారు.

కూతురి చికిత్స కోసం సాయం కోరుతున్న భార‌త దంప‌తులు

చెన్నై: అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌మ ఆరు నెల‌ల కూతురి ఆపరేష‌న్ కోసం ఆర్థికంగా స‌హాయం చేయాలంటూ కువైట్‌లోని భార‌తీయ దంప‌తులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఉత్త‌ర‌ఖండ్‌కు చెందిన అహ్మ‌ద్, షిరీన్ ఖురేషి దంప‌తులు గ‌త కొంత‌కాలంగా కువైట్‌లో ఉంటున్నారు. అక్క‌డ ఇద్ద‌రూ ఒక ప్రైవేట్ సంస్థ‌లో ప‌ని చేస్తున్నారు. ఈ దంప‌తుల‌కు ఆరు నెల‌ల పాప మ‌హిర ఉంది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో మ‌హిరకు వ‌చ్చిన జ‌బ్బు అనుకోని కష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో వీరి జీవితాలు ఒక్క‌సారిగా త‌ల‌కిందులై పోయాయి. అనారోగ్యంగా ఉండ‌డంతో మ‌హిర‌ను ఆస్ప‌త్రిలో చూపించ‌గా బిలియరీ అట్రేసియా(అరుదైన కాలేయం రుగ్మ‌త‌) అని తేలింది. దీంతో కాలేయ మార్పిడి త‌ప్ప‌నిస‌రి అని వైద్యులు సూచించారు.


అయితే, కువైట్‌లో కాలేయ మార్పిడి సాధ్యం కాదు కాబట్టి షిరీన్ కూతురు మ‌హిర‌ను తీసుకుని చెన్నైకు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చెన్నైలోని డాక్టర్ రెలా ఇన్స్టిట్యూట్ అండ్‌ మెడికల్ సెంటర్‌లో మ‌హిర చికిత్స పొందుతోంది. అయితే, కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు భారీ మొత్తం ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు తెలిపారు. కానీ, త‌మ వ‌ద్ద అంత మొత్తం లేద‌ని అహ్మ‌ద్ దంప‌తులు వాపోతున్నారు. త‌మ చిన్నారిని కాపాడుకోవాలంటే ద‌య‌గ‌ల వారు త‌మ‌కు తోచినంత సాయం చేయాల‌ని వారు కోరుతున్నారు. దీనికోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ https://www.ketto.org/fundraiser/Mahiraను వారు ప్రారంభించారు. 


వారి బ్యాంక్ ఖాతా వివరాలు: 

Shireen Qureshi 

SBI Account number- 32710328277 

State Bank of India, Pithoragarh, Uttrakhand 

IFSC code- SBIN0000700

Updated Date - 2020-08-30T16:59:12+05:30 IST