32వేల మంది ప్రవాసుల Driving license క్యాన్సిల్ చేసిన Kuwait.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-11-04T18:11:52+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 32వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.

32వేల మంది ప్రవాసుల Driving license క్యాన్సిల్ చేసిన Kuwait.. కారణమేంటంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 32వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. వీటిలో చాలా వరకు అక్రమమార్గంలో పొందినవి ఉంటే, మరికొన్ని స్టేటస్ అప్‌డేట్ చేయనివిగా సంబంధిత అధికారులు గుర్తించారు. అందుకే భారీ మొత్తంలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రవాసులకు కొత్త డ్రైవింగ్ లైన్స్ జారీని చాలా వరకు నిలిపివేసింది కువైత్. దీంతో ఈ పది నెలల్లో ఏకంగా 43శాతం మేర కొత్త డ్రైవింగ్ లైన్స్ జారీ పడిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రవాసులకు సంబంధించి మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య 72వేల నుంచి 41వేలకు పడిపోయింది. 


ఇక ప్రవాస విద్యార్థులు స్టడీ సమయంలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్లను అప్‌డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తుండడంతో వాటిని కూడా క్యాన్సిల్ చేస్తోంది. చదువు అయిన తర్వాత ఉద్యోగంలో చేరిన కూడా చాలామంది స్టేటస్ మార్చుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ను అలాగే వాడుతుండడంతో అధికారులు అలాంటి వాటిని భారీ మొత్తంలో రద్దు చేయడం జరిగింది. ఇలా ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 32వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్లను క్యాన్సిల్ చేసింది. ఇదిలా ఉంటే.. రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేయాలని కువైత్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.  

Updated Date - 2021-11-04T18:11:52+05:30 IST