Abn logo
Oct 13 2021 @ 09:19AM

ఆ వైద్యులకు భారీగా శాలరీలు పెంచిన Kuwait !

కువైత్ సిటీ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రవాస, దేశీయ వైద్యులకు కువైత్ తీపి కబురు అందించింది. వైద్యుల శాలరీలు 500 కువైటీ దినార్లు(రూ.1.24లక్షలు) పెంచింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఐసీయూ, అనస్థీషియా, ఎమర్జెన్సీ విభాగాలలో పనిచేసే వైద్యులకు ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే పెంచిన జీతాలు ఈ ఏడాది జూలై 1 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.

కాగా, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి మూడు ముఖ్యమైన విభాగాలలో పనిచేస్తున్న కువైటీ, ప్రవాస వైద్యులకు 500 దినార్ల ప్రత్యేక నెలవారీ పెరుగుదలను సివిల్ సర్వీస్ కమిషన్ ఆమోదించిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 1000 మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఆరోగ్యశాఖ నిర్ణయంపై ప్రభుత్వ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...