Advertisement
Advertisement
Abn logo
Advertisement

Visa transfers ను మరింత సులువు చేసిన Kuwait

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ వీసా ట్రాన్స్‌ఫర్స్‌ను మరింత సులువు చేసింది. ఇకపై వీసా సంబంధిత ట్రాన్సక్షన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా చేసుకునే విధంగా ప్రత్యేక వేదికను తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంబంధాల విభాగంలోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం) ప్రత్యేక ప్రతినిధి అసీల్ అల్ మజ్యేద్ మీడియాతో మాట్లాడారు. యజమానాలు తమ ఉద్యోగులకు సంబంధించిన వీసా సంబంధిత ట్రాన్సక్షన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. యజమానులు తమ ఉద్యోగులకు కావాల్సిన వర్క్ పర్మిట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు.


అలాగే వర్కర్లను ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్‌కు ఈ ప్లాట్‌ఫాం ద్వారా మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలియజేశారు. అంతేగాక వ్యాపారవేత్తలు తమ అధికారిక ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా కొత్త ఫైల్‌ను తెరవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపైనే అభ్యర్థించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. వ్యాపార యజమానులు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి, వారికి సంబంధించిన ట్రాన్సక్షన్స్‌ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడాన్ని మరింత సులభతరం చేయడం కోసమే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. 

Advertisement
Advertisement