కువైట్‌లో డొమెస్టిక్ వర్కర్లకు కొత్త వీసాలు !

ABN , First Publish Date - 2020-12-18T14:24:33+05:30 IST

డొమెస్టిక్ వర్కర్ల(గృహ కార్మికులు)కు కొత్త వీసాలు జారీ చేసే యోచనలో కువైట్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.

కువైట్‌లో డొమెస్టిక్ వర్కర్లకు కొత్త వీసాలు !

కువైట్ సిటీ: డొమెస్టిక్ వర్కర్ల(గృహ కార్మికులు)కు కొత్త వీసాలు జారీ చేసే యోచనలో కువైట్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. కరోనా ప్రభావంతో చాలా వరకు డొమెస్టిక్ వర్కర్స్ స్వదేశాలకు వెళ్లిపోవడంతో కువైటీ ఫ్యామిలీలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో విదేశాల నుంచి డొమెస్టిక్ వర్కర్లను కువైట్ రప్పించేందుకు పలు ప్రభుత్వ ఏజెన్సీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అంతర్గత, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్.. గృహ కార్మికులను తీసుకొచ్చేందుకు వర్క్ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకోవడానికి ఈ ఏజెన్సీలు సమర్పించిన సిఫారసును కేబినెట్ త్వరలో పరిశీలించనుంది.      

Updated Date - 2020-12-18T14:24:33+05:30 IST