హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు కువైట్ కొత్త వీసాలు

ABN , First Publish Date - 2021-06-18T15:50:58+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో విదేశీయుల రాక‌తో పాటు కొత్త వీసాల జారీని కువైట్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు కువైట్ కొత్త వీసాలు

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో విదేశీయుల రాక‌తో పాటు కొత్త వీసాల జారీని కువైట్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఫెడ‌రేష‌న్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిట‌ల్స్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ‌కు చెందిన కొవిడ్‌-19 ఎమ‌ర్జెన్సీ క‌మిటీ.. హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు కొత్త వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో మెడిక‌ల్‌, న‌ర్సింగ్, టెక్నిక‌ల్‌, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు కువైట్‌లో ప్ర‌వేశించేందుకు అనుమ‌తి ల‌భించింది. వీరు కువైట్‌లోని ప్రైవేట్ హాస్పిట‌ల్స్, క్లినిక్స్‌లో ప‌ని చేసుకోవ‌చ్చు. ఇక దేశంలో మ‌హ‌మ్మారి ప్ర‌భావం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి కువైట్ కొత్త వీసాల జారీని పూర్తిగా నిలిపివేసింది. అలాగే  విదేశీయుల రాక‌పై ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 7 నుంచి నిషేధం విధించింది.       

Updated Date - 2021-06-18T15:50:58+05:30 IST