అందులో Kuwait 18వ స్థానం..!

ABN , First Publish Date - 2021-09-09T17:10:35+05:30 IST

అమెరికాకు చెందిన ఎకనామిక్ వెబ్‌సైట్ వాల్‌స్ట్రీట్ 24/7 తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన అద్దె ఇళ్ల దేశాలు, నగరాల జాబితాను విడుదల చేసింది.

అందులో Kuwait 18వ స్థానం..!

కువైత్ సిటీ: అమెరికాకు చెందిన ఎకనామిక్ వెబ్‌సైట్ వాల్‌స్ట్రీట్ 24/7 తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన అద్దె ఇళ్ల దేశాలు, నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో గల్ఫ్ దేశం కువైత్ 18వ స్థానంలో నిలిచింది. కువైత్ సిటీలో సింగిల్ బెడ్‌రూమ్ నెలవారీ సగటు అద్దె 909 డాలర్లు(రూ.67వేలు). అదే నగరం బయట అయితే 730 డాలర్లు(రూ.54వేలు). అలాగే ఈ జాబితాలో ఖతర్ ఏకంగా నాల్గో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ దేశంలో సింగిల్ బెడ్‌రూమ్ నెలవారీ సగటు అద్దె 1,545 డాలర్లు(రూ.1.13లక్షలు). 


ఇవీ చదవండి..

Income Tax కట్టనంటూ అడ్డం తిరిగిన NRI.. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..

NEET Exam కు హాజరయ్యే విద్యార్థులకు కువైత్‌లోని Indian Embassy కీలక సూచనలు..


ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పదో ర్యాంక్ కొట్టేసింది. అక్కడ మంత్లీ సగటు అద్దె(సింగిల్ బెడ్‌రూమ్) రూ.87వేల పైమాటే. కువైత్ తర్వాతి స్థానంలో మరో అరబ్ దేశం బహ్రెయిన్ నిలిచింది. ఆ దేశంలో సింగిల్ బెడ్‌రూంకు సగటు నెలవారీ అద్దె సుమారు రూ.66,149. బహ్రెయిన్ తర్వాతి ర్యాంక్ లెబనాన్‌దే. ఇక్కడ మంత్లీ సగటు అద్దె(సింగిల్ బెడ్‌రూమ్) రూ.66వేలు. కాగా, ప్రపంచంలో అత్యంత ఖరీదైన అద్దె ఇళ్లు గల దేశంగా హాంగ్‌కాంగ్ నిలిచింది. అక్కడ సింగిల్ బెడ్‌రూమ్ మంత్లీ సగటు అద్దె 2,178 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.60లక్షలు.    



Updated Date - 2021-09-09T17:10:35+05:30 IST