కువైట్‌లో ఇండియ‌న్ ఇంజినీర్స్‌కు తాత్కాలికంగా ఎన్ఓసీ నిలిపివేత

ABN , First Publish Date - 2020-08-14T14:43:09+05:30 IST

ఇండియ‌న్ ఇంజినీర్స్ విష‌యంలో కువైట్‌లోని సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి.

కువైట్‌లో ఇండియ‌న్ ఇంజినీర్స్‌కు తాత్కాలికంగా ఎన్ఓసీ నిలిపివేత

కువైట్ సిటీ: ఇండియ‌న్ ఇంజినీర్స్ విష‌యంలో కువైట్‌లోని సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ఇండియ‌న్ ఇంజినీర్స్‌కు తాత్కాలికంగా ఎన్ఓసీని నిలిపివేశాయి. ఇంజినీర్ పేరుపై వ‌ర్క్ ‌ప‌ర్మిట్ కోసం కొంద‌రు న‌కిలీ ధృవపత్రాలను ఉప‌యోగిస్తున్న‌ట్లు తేల‌డంతో కువైట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ‌కొంద‌రు భార‌తీయులు వ‌ర్క్ ‌ప‌ర్మిట్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా వారి ధృవపత్రాలు సొసైటీ నిర్దేశించిన షరతుకు అనుగుణంగా లేక‌పోవ‌డంతో తిర‌స్క‌రించింది. అయినా... ఇలా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ కొంతమంది భారతీయులు ఇంజినీర్ పేరుపై ప‌ర్మిష‌న్ పొందారు. వీరు న‌కిలీ ధృవపత్రాలను ఉప‌యోగించే ఇలా వ‌ర్క్ ప‌ర్మిట్ పొందినట్టు సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అందుకే ఇండియ‌న్ ఇంజినీర్స్‌కు తాత్కాలికంగా ఎన్ఓసీని నిలిపివేస్తున్న‌ట్లు సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్ర‌క‌టించాయి. అంతేగాక‌ సొసైటీ ష‌ర‌తుల‌కు అనుగుణంగా లేని 3 వేల మంది భారతీయుల ద‌ర‌ఖాస్తుల‌ను ఈ సంద‌ర్భంగా కేఎస్ఈ నిరాకరించింది. అలాగే ఫోర్జరీ ఆరోపణలపై సొసైటీ ఏడుగురు భారతీయులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించింది. 

Updated Date - 2020-08-14T14:43:09+05:30 IST