కువైట్‌లో ఇక‌పై 12 గంట‌ల క‌ర్ఫ్యూ...

ABN , First Publish Date - 2020-05-30T19:06:53+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కువైట్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆదివారం నుంచి 12 గంట‌ల క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు కువైట్ ప్ర‌భుత్వం తెలిపింది.

కువైట్‌లో ఇక‌పై 12 గంట‌ల క‌ర్ఫ్యూ...

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కువైట్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆదివారం నుంచి 12 గంట‌ల క‌ర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు కువైట్ ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌తిరోజు సాయంత్రం 6 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల పాటు కర్ఫ్యూ ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. అలాగే మ‌సీదుల ఓపెనింగ్‌కు కూడా అనుమ‌తి ఇచ్చింది. అయితే మ‌సీదుల‌కు వ‌చ్చే వారు సామాజిక దూరం పాటించ‌డం, చేతుల‌కు గ్లౌజులు ధ‌రించ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. "మేము పూర్తి లాక్‌డౌన్‌ కొనసాగించ‌లేం. క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి వచ్చే ప్రణాళికను రూపొందించాము. సాధారణ జీవితానికి తిరిగి రావడంతో పాటు మహమ్మారితో జీవించడం తప్పనిసరి" అని కువైట్ ప్ర‌ధాని షేక్ సబా ఖలీద్ అల్ హమద్ అల్ సబా మీడియా స‌మావేశంలో అన్నారు. ఇదిలా ఉంటే... కువైట్‌లో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 ఇప్ప‌టివ‌ర‌కూ 24,112 మందికి సోకింది. 185 మంది మ‌ర‌ణించారు. 

Updated Date - 2020-05-30T19:06:53+05:30 IST