Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌లో కరోనా విలయం.. కువైట్ కేబినెట్ కీలక నిర్ణయం!

కువైట్ సిటీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అంతకంతకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. మరోవైపు ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులేకపోవడంతో చాలా మంది రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇక భారత కష్టాలను చూసిన పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్‌, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అంగీకారం తెలిపాయి. తాజాగా ఈ జాబితాలో గల్ఫ దేశం కువైట్ చేరింది. ప్రాణవాయువు కొరతతో దయనీయ స్థితిలో ఉన్న భారత్‌కు ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కువైట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ఉన్న సత్ససంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తుతం కరోనా వల్ల భారత్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితిపై కేబినెట్  విచారం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరతతో ఆస్పత్రుల్లో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement