స్కూలు లిఫ్టులో ఇరుక్కుని ల్యాబ్ అటెండెంట్ మృతి!

ABN , First Publish Date - 2021-07-03T15:52:21+05:30 IST

హరియాణాలోని పానీపట్ జిల్లాలో గల...

స్కూలు లిఫ్టులో ఇరుక్కుని ల్యాబ్ అటెండెంట్ మృతి!

పానీపట్: హరియాణాలోని పానీపట్ జిల్లాలో గల ఎస్డీవీఎం సీనియర్ సెకెండర్ స్కూలు లిఫ్టులో ఇరుక్కుపోయిన స్కూలు ల్యాబ్ అసిస్టెంట్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన స్కూలులోని రెండవ అంతస్థులో చోటుచేసుకుంది. ల్యాబ్ అటెండెంట్ లిప్టులో ఇరుక్కున్న ఐదు గంటల తరువాత రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, లిఫ్ట్ తలుపులు కట్ చేసి, బాధితుడిని బయటకు తీసుకువచ్చారు. 


అయితే అప్పడికే అతను మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబీకులు ఈ ఉదంతంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడు అంకిత్ గుప్తా 2011 నుంచి స్కూలులో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా మృతుని బంధువు రవీంద్ర జైన్ మాట్లాడుతూ ప్రమాద ఘటన గురించి తెలియగానే తాము స్కూలుకు వెళ్లామని, లిఫ్టులో ఇరుక్కుపోయి అంకిత్ మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదం కాదని, కుట్రపూరితంగా జరిగిందని, ఈ ఉదంతంపై వెంటనే దర్యాప్తు చేయాలని రవీంద్ర జైన్ కోరుతున్నారు. 

Updated Date - 2021-07-03T15:52:21+05:30 IST