Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  రంగారెడ్డి

 మిర్యాలగూడ,   డిసెంబరు 2: భవన నిర్మాణరంగ కార్మికుల చట్టాలను పునరుద్ధరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక లేబర్‌ అడ్డావద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికల చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాడాలన్నారు. నిర్మాణ రంగంలో పెరిగిన ముడిసరుకుల ధరలు తగ్గించాలన్నారు. అందుకోసం డిసెంబర్‌ 2, 3 తేదీల్లో  దేశవ్యాప్త సమ్మెలో సిఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కార్మిక చట్టాలను పునరుద్ధరింప చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ అధ్యక్షత వహించగా, జిల్లా నాయకులు డాక్టర్‌ మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రాం మూర్తి, నల్లగుంట్ల సోమయ్య, మంగారెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, గోవర్ధిని, పాడేటి ప్రసాద్‌, కేశవులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు రక్షణకోసం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపు నిచ్చారు. కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీడబ్లూఎ్‌ఫఐ) కేంద్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు చెపట్టిన  సమ్మెలో భాగంగా నల్లగొండలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.సలీం, భవన నిర్మాణ కార్మిక సంఘం జి ల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ, జిల్లా కమిటీ సభ్యుడు పోలే సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సాగర్ల మల్లయ్య,  సుందరయ్య సెంట్రింగ్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బచ్చల కూరి గురవయ్య దేవరపల్లి వెంకట్‌రెడ్డి లింగయ్య పాల్గొన్నారు. కట్టంగూరులో నిర్వహించిన కార్య క్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుకూరి నర్సింహ, నాయకులు పాలడుగు యాదయ్య, మల్లేశం, నర్సింహ, బండారి యాదయ్య, దొడ్డు నర్సింహ, పందుల సైదులు, వెంకటేశం అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మర్రిగూడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఏర్పుల యాదయ్య, భూషరాజు లక్ష్మణ్‌, సైదులు, లఫంగి లింగయ్య, నర్సింహ, పర్వతాలు, నూకల యాదయ్య పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి దేవరకొండలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య, సీఐటీయూ నాయకులు లింగయ్య, చిన్న వెంకటయ్య, ఇద్దయ్య, గిరి, ఆంజనేయులు పాల్గొన్నారు.  త్రిపురారంలో భవన నిర్మాణ కార్మికులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదయ్య, కెవీసీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దైద శ్రీను, మద్దెల శ్రీను, నగిరి వెంకన్న, బైరం శ్రీను, బాబు, వెంకటేశ్వర్లు, నాగయ్య, సైదులు, కొండేటి శ్రీను, సురేష్‌ పాల్గొన్నారు.  దామరచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి బైరం దయానంద్‌, సీపీఎం మండల కార్యదర్శి మాలోతు వినోద్‌నాయక్‌, పాపానాయక్‌, సుభాని, పల్లపు సుదర్శన్‌, బాబ, దుర్గయ్య పాల్గొన్నారు.


Advertisement
Advertisement