అప్‌గ్రేడ్‌.. పాఠశాలల్లో సౌకర్యాల లేమి

ABN , First Publish Date - 2020-05-30T09:14:19+05:30 IST

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా ఉంది

అప్‌గ్రేడ్‌.. పాఠశాలల్లో సౌకర్యాల లేమి

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా  కొన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే  చందంగా ఉంది. పాఠశాలల  స్థితిగతులను మార్చి వేస్తామని పాలకులు  చెబుతున్నారు.  నాడు - నేడు కార్యక్రమంలో కొన్ని పాఠశాలలను గుర్తించి అభివృద్ది చేస్తామంటున్నారు.  యూపీ పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలలకు భవనాలు సమకూర్చకుండా, ఉన్నత పాఠశాల గుర్తింపు ఇవ్వకుండా జాప్యం  జరుగు తోంది.


జిల్లాలోని మైలవరం మండలం పొందుగల, ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం, మచిలీపట్నం మండలం తుమ్మలపాలెం, కోన, పెడన మండలం చేవెండ్ర, నందమూరు,  కలిదిండి మండలం కొండంగి పాఠశాలలను 2012 విద్యా సంవత్సరంలో అప్‌గ్రేడ్‌ చేసి ఎనిమిదో తరగతి నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు.  2014 నుంచి  పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.  ఈ పాఠశాలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా పేరు మార్చినా అధికారి కంగా అనుమతులు ఇవ్వలేదు.  జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల హోదాలో ఉన్న  పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు, ఇతర సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అమలు కాలేదు. యూపీ పాఠశాల హెచ్‌ఎం లనే చాలాచోట్ల  ప్రధానోపాధ్యాయులుగా కొనసా గిస్తున్నారు.  పెడన మండలం చేవెండ్ర ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేసిన తరువాత ఇప్పటి వరకు  ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు పదో తరగతి  పరీక్షలకు హాజరయ్యారు. ఈ పాఠశాలలో అదనపు తరగతి గుదులు నిర్మాణం చేయలేదు  ప్రాధమిక పాఠశాల గదులు, వరండాలోనే తరగతులను నిర్వహిస్తున్నట్లు తల్లిదడ్రులు చెబుతున్నారు. 


అదనపు తరగతి గదులు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం రూ.65 లక్షలు విడుదలయ్యాయి.  ఇసుకకొరత, నీటి కొరత తదితర కారణాలు చూపి తరగతి గదులు  నిర్మాణం చేయకుండా జాప్యం చేశారు. ఈ నిధులు ఉన్నాయో, వెనక్కి పోయాయో తెలియని పరిస్థితి నెలకొందని గ్రావస్థులు అంటున్నారు.  చేవెండ్ర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకంతో పాటు,  అవసరమైన తరగతి గదులు నిర్మాణం చేయాలని పలుమార్లు గ్రామస్థులు కలెక్టర్‌, డీఈవోకు వినతిపత్రాలు అందించినా ఇంత వరకు  ఎలాంటి చర్యలు  తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.  తమ పిల్లలను వడ్లమన్నాడు ఉన్నత పాఠశాలకు    పంపుతున్నామని   చేవేండ్ర గ్రామస్థులు తెలిపారు.  అప్‌గ్రేడ్‌ అయినా ఉన్నత పాఠశాలలుగా గుర్తింపు ఇవ్వకపోవడంపై  మచిలీపట్నం డీవైఈవో  యువీ సుబ్బారావును వివరణ కోరగా జీవో 254 ప్రకారం అనుమతులు రావాల్పి ఉందన్నారు. పాఠశాలలకు  ఫర్నీచర్‌, అదనపు త రగ తి గదులు కావాలని పాఠశాల విద్యాకమిటీలు, హెచ్‌ఎంలు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2020-05-30T09:14:19+05:30 IST