Abn logo
Sep 19 2021 @ 10:21AM

మహిళా రక్షణలో కోవై ఫస్ట్‌

                       - రెండో స్థానంలో చెన్నై 


అడయార్‌(చెన్నై): మహిళల రక్షణలో కోయంబత్తూరు నగరం మొదటిస్థానంలో నిలిచింది. రాజధాని చెన్నై నగరానికి రెండో స్థానం దక్కింది. కేంద్ర హోం శాఖ పరిధిలోని నేర గణాంకాల నమోదు విభాగం (ఎన్‌సీఆర్‌బి) గత యేడాది దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల వివరాలను తాజాగా వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నారుల రక్షణ, వారిపై జరిన నేరాలు ఘోరాలు తదితర అంశాలు ఉన్నాయి. దేశంలోని 19 పెద్ద నగరాల్లో కోయంబత్తూరు నగరానికి మొదటి స్థానం లభించగా, చెన్నై రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కోవైలో సగటున లక్ష మందికి 9 మంది మహిళలపై నేర కేసులు నమోదైనట్టు ఈ గణాంకాలు వెల్లడించాయి.