బైడెన్ ప్రమాణస్వీకారం వేళ.. లేడీ గాగా పాట... జెన్నిఫర్‌ ఆట

ABN , First Publish Date - 2021-01-19T12:42:06+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధమయ్యింది. భారత కాలమానం ప్రకారం... బుధవారం (జనవరి 20వ తేదీ) రాత్రి 10 గం టలకు ఆయన దేశాధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.

బైడెన్ ప్రమాణస్వీకారం వేళ.. లేడీ గాగా పాట... జెన్నిఫర్‌ ఆట

కొవిడ్‌ కారణంగా పట్టాభిషేకం కుదింపు

2 లక్షల టిక్కెట్లకు బదులు వెయ్యి మందికే టిక్కెట్లు

కేపిటల్‌ భవనం ముంగిటే ప్రమాణస్వీకారం

వాషింగ్టన్‌, జనవరి 18: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధమయ్యింది. భారత కాలమానం ప్రకారం... బుధవారం (జనవరి 20వ తేదీ) రాత్రి 10 గం టలకు ఆయన దేశాధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు. సంప్రదాయం ప్రకారం ఆయన కంటే ముందుగానే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ పదవీస్వీకారం చేయాల్సి ఉం టుంది. ఈ ప్రమాణస్వీకారోత్సవం కేపిటల్‌ భవనం వెలుపలే జరుగుతుంది. అనంతరం బైడెన్‌ శ్వేతసౌధంలోకి అడుగుపెడతారు. మిలటరీ బ్యాండ్‌ మోత మధ్య దేశ సైనికాధికారులు ఆయనను, ప్రథమ మహిల జిల్‌ బైడెన్‌ను, కమలాహారిస్‌ దంపతులను వెంట తోడ్కొని వెళతారు. ఈసారి కేవలం 200మందిని మాత్రమే ప్రమాణ వేదిక వద్దకు అనుమతిస్తున్నారు. వీరందరికీ కొవిడ్‌ పరీక్షలు చేసి ధ్రువీకరించుకున్నాకే అనుమతి ఇచ్చారు. 


ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలల్లో ప్రజలు వాషింగ్టన్‌ వస్తారు. కానీ ఈసారి కొవిడ్‌ ఉధృతి, కేపిటల్‌ భవనంపై 6వ తేదీన జరిగిన దాడి దృష్ట్యా ప్రజలు అతి తక్కువ సంఖ్యలో వచ్చి కేపిటల్‌ దగ్గరగా ఉన్న నేషనల్‌ మాల్‌ నుంచి తిలకిస్తారు.  ఈ ఉత్సవాల పాసుల నిమిత్తం సాధారణంగా 2లక్షల టిక్కెట్లను విక్రయిస్తారు. గా నీ ఈసారి కేవలం వెయ్యి టిక్కెట్లను మాత్రమే ఇచ్చారు. ప్రమాణస్వీకారం తరువాత సైనిక పరేడ్‌ పెన్సిల్వేనియా ఎవెన్యూ వద్ద జరగాలి. కొత్త కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో బైడెన్‌ సైనిక వందనం అందుకోవాల్సి ఉన్నా ఈసారి వీడియో లింక్‌ ద్వారా ఈ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తారు. వేడుకలను కుదించినప్పటికీ అమెరికన్‌ సంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలు కొనసాగిస్తున్నారు. బైడెన్‌కు అభిమాని అయిన పాప్‌ సింగర్‌ లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఇక సుప్రసిద్ధ నటి, గాయ ని, డాన్సర్‌ జెనిఫర్‌ లోపెజ్‌ తన ఆటపాటలతో అలరిస్తారు. ప్రముఖ నటుడు టామ్‌ హాంక్స్‌ ఓ గంటన్నరపాటు ప్రముఖ నటీనటులతో ఓ షో నిర్వహిస్తారు.

Updated Date - 2021-01-19T12:42:06+05:30 IST