బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని అదృశ్యం.. అసలేమైంది!?

ABN , First Publish Date - 2021-04-26T18:14:07+05:30 IST

ఓ విద్యార్థిని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అదృశ్యమైంది.

బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని అదృశ్యం.. అసలేమైంది!?

హైదరాబాద్/రాంనగర్‌ : మేడ్చల్‌ సైదేనిగడ్డ తండాలోని ఇంటికి బయలుదేరిన ఓ విద్యార్థిని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అదృశ్యమైంది. మేడ్చల్‌ సైదేనిగడ్డ తండాకు చెందిన మాలోతు శంకర్‌నాయక్‌ కుమార్తె మాలోతు సింధు(21) నిజామ్‌కాలేజీలో మైక్రోబయాలజీ మూడో సంవత్సరం చదువుతోంది. న్యూనల్లకుంట శ్రీ హాస్టల్‌లో ఉంటుంది. శనివారం సాయంత్రం తండ్రి శంకర్‌నాయక్‌ ఫోన్‌ చేసి సింధును తండాకు రావాల్సిందిగా సూచించాడు. ఆరున్నర గంటలకు మళ్లీ ఫోన్‌ చేయగా బస్టా్‌ప్‌లో వెయిట్‌ చేస్తున్నానని, ఇంకా బస్సులు రావడంలేదని సింధూ సమాధానం ఇచ్చింది. మళ్లీ 7.15 గంటలకు కూతురుకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని సమాధానం వచ్చింది. పలుమార్లు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌గానే రావడంతోనే ఆదివారం ఉదయం ఆయన హాస్టల్‌కు వచ్చారు. శనివారం సాయంత్రం నాలుగున్నరకే సింధు హాస్టల్‌నుంచి బయలుదేరినట్లు వార్డెన్‌ తెలిపారు. దీంతో శంకర్‌నాయక్‌ తన కుమార్తె అదృశ్యంపై నల్లకుంట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజీలో ఆమె సీనియర్‌ జడ్చర్లకు చెందిన అరుణ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-26T18:14:07+05:30 IST