Jul 31 2021 @ 17:53PM

RRR తర్వాత ‘లహరి’ అకౌంట్‌లోకి మరో చిత్రం

ఆడియో రైట్స్ విషయంలో ‘లహరి’ సంస్థ దూసుకుపోతోంది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ ఆడియో రైట్స్‌ని టీ సిరీస్‌తో కలిసి ‘లహరి’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువ హీరో ఆది అథ్లెటిక్‌గా నటించిన ‘క్లాప్‌’ చిత్ర ఆడియో హక్కులను ‘లహరి’ సొంతం చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత బి.కార్తికేయన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. పృథ్వీ ఆదిత్య ఈ చిత్రానికి కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, క్రిష్‌ కురుప్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌, మైమ్‌ గోపి, మునిష్కాంత్‌ తదితరులు నటించారు. సంగీత మేధావి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ను ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్స్‌ సొంతం చేసుకుంది. 


దీనిపై ‘క్లాప్‌’ చిత్ర నిర్మాత బి.కార్తికేయన్‌ మాట్లాడుతూ.. ‘‘లహరి మ్యూజిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ సొంతం చేసుకునే ప్రతి ఒక్క చిత్రం ఆడియోకు మంచి పబ్లిసిటీ కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. లహరి మ్యూజక్స్‌ కథపై సినీ ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ సంస్థ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’ వంటి చిత్రాల ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాంటి సంస్థకు మా చిత్రం ఆడియో రైట్స్‌ను అప్పగించడం చాలా సంతోషంగా ఉంది’’ అని వెల్లడించారు.