ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు

ABN , First Publish Date - 2020-10-24T10:45:56+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు

భద్రాచలం, అక్టోబర్‌ 23: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.రామాలయ ప్రాంగణంలో గల శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భక్తులు దర్శించి పులకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలకు ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.  కాగా శనివారం అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 


నేడు వీరలక్ష్మి అలంకారం

నేడు అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. దారిద్య్రం ధ్వంసినీందేవీం సర్వోపద్రవవారిణీం.. అన్న పురాణం అమ్మ వారిని వీరలక్ష్మిగా కీర్తిస్తోంది. మన దారిద్ర్యాన్ని, అన్ని రకాల ఉప ద్రవాలను పారద్రోలే వీరత్వం కల అమ్మ. త్రిమూర్తులకు సైతం సాధ్యం కాని మహిషాసురుని, ముగ్గురమ్మల శక్తి స్వరూపమైన వీరలక్ష్మిగా ఆవిర్భవించి, సంహరించింది. ఈ అమ్మను ఆరాధిస్తే అన్ని రకాల దుష్ట శక్తులు, భయాలు, ఉప ద్రవాలు తొలగిపోతాయి. వీరలక్ష్మిః పృధగ్గేహే అని శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం చెప్పినట్లు ప్రత్యేక సన్నిధిలో వీరలక్ష్మిగా వేంచేసి ఉన్న భద్రాద్రి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని త్రికరణశుద్ధిగా సేవించండి.

Updated Date - 2020-10-24T10:45:56+05:30 IST