Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీశైలంలో లక్షదీపోత్సవం

శ్రీశైలం, నవంబరు 29:  కార్తీక మాసం నాలుగో సోమవారంనాడు శ్రీశైలానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతళగంగలో స్నానమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధిలో, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించారు. సోమవారం వర్షం కురవడంతో లక్షదీపోత్సవానికి ఆటకం కలుగుతుందని దేవస్థానం అధికారులు భావించారు. అయితే రాత్రికి వర్షం తగ్గుముఖం పట్టడంతో పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చి లక్షదీపోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించారు. 

Advertisement
Advertisement