Jun 11 2021 @ 12:20PM

సినీనటి ఈషా సుల్తానాపై దేశద్రోహం కేసు

లక్షద్వీప్ పోలీసుల ఎఫ్ఐఆర్

తిరువనంతపురం : రాజద్రోహం కేసులపై ఒకవైపు సుప్రీంకోర్టు దర్యాప్తు సాగిస్తుండగా మరో వైపు లక్షద్వీప్ పోలీసులు ఓ సినిమానటిపై అదే కేసు నమోదు చేశారు. కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్‌‌నకు చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్‌, నటి అయిన ఆయిషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయిషా సుల్తానాపై లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు సి అబ్దుల్  ఖదీర్ హాజి ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు పెట్టారు.ఇటీవల ఒక మళయాళం టీవీ ఛానల్‌ చర్చలో పాల్గొన్న ఆయిషా సుల్తానా మాట్లాడుతూ ప్రఫుల్‌ పటేల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 ప్రఫుల్  పటేల్  కేంద్ర ప్రభుత్వం పంపించిన జీవాయుధంగా అయిషా అభివర్ణించారు. ఆయన రాక ముందు తమ దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఇపుడు రోజూ వంద కరోనా కేసులు బయటపడ్డాయని ఆమె ఆరోపించారు.  ఆయిషా లక్షద్వీప్‌ కొత్త లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ప్రఫుల్‌ పటేల్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఖండించారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయిషాపై దేశద్రోహం సెక్షన్లు ఐపీసీ 124 ఎ, 153 బిల కింద లక్షద్వీప్ పోలీసులు కేసు నమోదు చేశారు.