May 11 2021 @ 08:24AM

ల‌క్ష్మీ మంచుకి షాకిచ్చిన హ్యాక‌ర్స్‌

సోషల్ మీడియా హ్యాక‌ర్స్ సెల‌బ్రిటీల అకౌంట్స్‌ను ఎప్పుడూ గ‌మ‌నిస్తూనే ఉంటారు. ఏ మాత్రం వీలు చిక్కినా హ్యాక్ చేసేస్తుంటారు. టాలీవుడ్‌లో ల‌క్ష్మీ మంచుకి హ్యాక‌ర్స్ షాకిచ్చారు. ఈ విష‌యాన్ని ల‌క్ష్మీ మంచు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కొన్ని రోజుల ముందు చిట్టి చిల‌క‌మ్మా అనే పేరుతో ల‌క్ష్మీ మంచు ఓ యూ ట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పిల్లలకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తుంటారు. త‌న కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్ల‌ల పెంప‌కం, వారికి చ‌దువు చెప్పే విష‌యాల్లో పాటించాల్సిన ప‌ద్ధ‌తులను వివ‌రిస్తూ వ‌చ్చింది లక్ష్మి. చానెల్ హ్యాక్ అయిన త‌ర్వాత.. తమ యూ ట్యూబ్ అకౌంట్‌ను ఎవ‌రో హ్యాక్ చేశార‌ని, అందులో నుంచి ఏదేని అర్థ ర‌హిత‌మైన స‌మాచారం వ‌స్తే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌మ టీమ్ సైట్‌ను తిరిగి పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని తెలిపారు ల‌క్ష్మీ మంచు.