సంస్కృతం అనే పదం చేర్చడం వల్ల నష్టం లేదు: లక్ష్మీపార్వతి

ABN , First Publish Date - 2021-10-29T21:05:52+05:30 IST

సంస్కృతం అనే పదం చేర్చడం వల్ల నష్టం లేదు: లక్ష్మీపార్వతి

సంస్కృతం అనే పదం చేర్చడం వల్ల నష్టం లేదు: లక్ష్మీపార్వతి

కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో భాషా చైతన్య సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలుగు సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....తెలుగుభాష, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, వాటిని వివరంగా తెలుసుకునేందుకు యూనివర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు మీడియం తెచ్చారని చాలా గొడవ చేస్తున్నారని, తెలుగుకి ఇప్పుడు కాదు ఎప్పుడో అన్యాయం జరిగిందని అన్నారు. ఇంగ్లీషు మీడియం స్కూల్‌లు కాలేజీలు రావడంతో తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగిందన్నారు. ప్రభుత్వ స్కూళ్ళు మూత పడే పరిస్థితి వచ్చిందని, గత ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియంలో తెలుగు భాషను తప్పని సరి చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఒక సబ్జెక్టు తెలుగు తప్పని సరి చేసిందన్నారు. దాని వలన మాతృ భాషకు, తెలుగుకు స్థానం దక్కిందన్నారు. దీన్ని తప్పుబడుతున్న వారి పిల్లలంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలొనే చదువుతున్నారని ఆమె చెప్పారు. 

Updated Date - 2021-10-29T21:05:52+05:30 IST