భూములను స్వాధీనం చేసుకోండి

ABN , First Publish Date - 2020-10-25T09:54:13+05:30 IST

లక్ష్మీపురం శివారు చింతలమడలో అన్యాక్రాంతం అయిన ఏపు మురుగుకాలువ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

భూములను స్వాధీనం చేసుకోండి

చల్లపల్లి, అక్టోబరు 24 : లక్ష్మీపురం శివారు చింతలమడలో అన్యాక్రాంతం అయిన ఏపు మురుగుకాలువ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం విలేకర్ల సమావేశంలో   మాట్లాడారు.


అధికారులు ఇచ్చిన సమాచారం పరిశీలిస్తే మురుగుకాలువ భూములు అన్యాక్రాంతం అయ్యాయనీ, ఆక్రమణదారులను గుర్తించేందుకు సర్వే జరుగుతోందనీ నిర్ధారణ అయిందన్నారు. భూముల సాగుకు, చెరువు తవ్వకానికి అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలియచేశారని వివరించారు. వాల్టా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జరిమానా వసూలు చేయాలనీ, సర్వే వెంటనే పూర్తిచేసి ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.  అఖిలపక్ష నేతలు రాయపూడి వేణుగోపాలరావు, అడ్డాడ ప్రసాద్‌బాబు, మోర్ల రాంబాబు, మీర్‌ రిజ్వాన్‌, కొండేటి భాస్కరరావు, అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T09:54:13+05:30 IST