Jul 30 2021 @ 12:36PM

ఆకట్టుకుంటున్న 'లక్ష్య' న్యూ పోస్టర్

యంగ్ హీరో నాగ శౌర్య - కేతిక శర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'లక్ష్య'. మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. షూటింగ్ ముగించుకున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం.. ప్రతీ శుక్రవారం ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు ఇంతకముందే వెల్లడించారు. ఆ విధంగానే #LAKSHYASFRIDAY కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌లకి మంచి స్పందన రాగా.. ఇప్పుడు వదిలిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత కలిగిస్తోంది. నాగ శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మిస్తున్నారు.