ఇప్పటివరకు చాక్లట్ బాయ్ తరహా పాత్రల్లోనూ, పక్కంటబ్బాయి రోల్స్‌లోనూ మెప్పించిన యంగ్ హీరో నాగశౌర్య త్వరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్చరీ నేపథ్యంలో తెరెకెక్కుతున్న `లక్ష్య` సినిమాలో నటిస్తున్నాడు. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు. సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది.
సంక్రాంతి సందర్భంగా తాజాగా ఈ సినిమా యూనిట్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. హీరోయిన్ కేతికా శర్మతో నాగశౌర్య రొమాంటిక్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్లో నాగశౌర్య క్లీన్ సేవ్‌తో లవర్ బాయ్ తరహాలో కనిపించాడు. సంతోష్ జాగర్లమూడి రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.