Abn logo
Oct 25 2020 @ 13:05PM

లాలూపై బీహార్ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Kaakateeya

నన్ను చంపడానికి తంత్ర కర్మలు చేశారు...

పట్నా (బీహార్): బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూయాదవ్ పై బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడేళ్ల క్రితం తనను చంపడానికి లాలూ యాదవ్ తాంత్రిక కర్మలు చేశారని సుశీల్ కుమార్ ఆరోపించారు.లాలూ ప్రసాద్ కు మూఢనమ్మకాలపై నమ్మకంతో తెల్ల కుర్తా ధరించడం మానేయడంతోపాటు తాంత్రిక్ శంకర్ చరణ్ త్రిపాఠిని ఆర్జేడీ జాతీయ ప్రతినిధిగా చేశాడని సుశీల్ ట్వీట్ చేశారు. 

తనను చంపడానికి మీర్జాపూర్ వింధ్యచల్ థామ్ వద్ద లాలూ తాంత్రిక పూజలు చేశారని ఆయన పేర్కొన్నారు.లాలూ ప్రజలను నమ్మడం లేదని, జంతుబలి, ఆత్మలను ప్రార్థించడం వంటి ఆచారాలు చేస్తూనే ఉన్నారని, ఆయన జైలు నుంచి తప్పించుకోలేరని సుశీల్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలకు ముందు రాంచీలోని కైలీ బంగళాలో జైలు మాన్యువల్ ను ఉల్లంఘించి నవమి రోజు యాదవ్ మూడు మేకలను బలి ఇవ్వబోతున్నట్లు సుశీల్ ట్వీట్ చేశారు.నితీష్ పాలనలో బీహార్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement