మిరప రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2020-12-04T05:54:14+05:30 IST

మిరప సాగులో రైతుల సమస్యలను పరిష్కరించి వారిని అదుకుంటామని జాతీయ మిరప టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

మిరప రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
మిరపలో రకాలను పరిశీలిస్తున్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు 

లాంఫాం(తాడికొండ), డిసెంబరు 3: మిరప సాగులో రైతుల సమస్యలను పరిష్కరించి వారిని అదుకుంటామని జాతీయ మిరప టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. లాంఫాంలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో గురువారం శాస్త్రవేత్తలు, రైతులు, మిరప ఎగుమతిదారులతో ఏర్పాటు చేసిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మిరప ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. శాస్త్రవేత్తలు నష్టాలు రాకుండా పరిశోధనలు విరివిగా నిర్వహించాలన్నారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సీ.వెంకటరమణ జెమిని వైరస్‌ను తట్టుకునే విధంగా వృద్ధి చేసిన   ఎల్‌సీఏ-657, ఎల్‌సీఏ-680, ఎల్‌సీఏ-684 గురించి వివరించారు.    లాంఫాంలో ఉన్న మిరప సాగు పొలాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శారద, గిరధర్‌, విజయలక్ష్మి, వెంకటరమణ, శిరీషా, రజిని, తనుజా, స్పైసెస్‌ బోర్డ్‌ డీడీఈ మోహన్‌రావు, ఉద్యానశాఖ గుంటూరు డీడీ సుజాత పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T05:54:14+05:30 IST