Abn logo
Nov 26 2020 @ 18:08PM

లంబోదర క్రియేషన్స్ తొలి చిత్రం ప్రారంభం

లేడీ ఓరియెంటెడ్ కథతో లంబోదర క్రియేషన్స్ తమ తొలి చిత్రాన్ని ప్రారంభించింది. ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. సుశాంత్ కంతుల, జెస్సిక అమనపు జంటగా నటిస్తున్నారు. రాజేష్ భూపతి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే పేరును వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. స్వీటీ, బాలాజీ, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు రాజేష్ భూపతి మాట్లాడుతూ...''లేడీ ఓరియెంటెడ్‌గా సాగే చిత్రమిది. నారి, ద పవర్ ఆఫ్ వుమెన్ అనే వర్కింగ్ టైటిల్‌తో పూజా కార్యక్రమాలు జరిపాం. లవ్ యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలు నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెల 15వ తేదీ నుంచి తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. కడప, హైదరాబాద్‌లోని పలు లొకేషన్‌లలో మూడు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం.." అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement