Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 13:24PM

SALE : కొచ్చీలో కోట్లు పలుకుతోన్న కోహ్లీ ‘మాజీ‘ కారు

కొచ్చి: అసలే ప్రపంచ ప్రఖ్యాత కార్ల బ్రాండ్‌. పైగా దాన్ని గతంలో ఎవరు వాడారు? ఇంకెవరూ, మన టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ! మరి భారత కెప్టెన్ షికార్లు చేసిన కారు, మామూలు ధర పలుకుతుందా, చెప్పండి? 1.35 కోట్లు చెల్లించి తీసుకెళ్లమంటున్నారు కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ షోరూమ్ వారు.


2015లో, సూపర్ కాస్ట్‌లీ కారు, ‘లాంబోర్గిని స్పైడర్‘ ఖరీదు చేశాడు కోహ్లీ. కేవలం నాలుగు సెకన్లలో ఈ అల్ట్రా మాడర్న్ కారు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే, ఈ బ్యూటిఫుల్ బీస్ట్ టాప్ స్పీడ్ గంటకు 324 కీలో మీటర్లు. ఇంకా ఎన్నో విశేషాలున్న కోహ్లీ మాజీ కారు ఇప్పుడు మాత్రం కొచ్చీలో ఉంది. ఓ యూజ్డ్ లగ్జరీ కార్స్ షోరూమ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ప్రస్తుతానికి 1.35 కోట్లుగా ధర నిర్ణయించారు. చూడాలి మరి, చివరకు ఏ కోహ్లీ అభిమాని ఎన్ని కోట్లకు స్వంతం చేసుకుంటాడో.    

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement