లాంకో ఇన్‌ఫ్రా లిక్విడేషన్‌కు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-04T12:05:31+05:30 IST

లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ ఆస్తుల విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ గడువు పొడిగించింది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ అనేక చర్యలు...

లాంకో ఇన్‌ఫ్రా లిక్విడేషన్‌కు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ ఆస్తుల విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ గడువు పొడిగించింది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. విక్రయానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఎన్‌సీఎల్‌టీ మరో మూడు నెలల వ్యవధిని ఇచ్చింది. నాలుగు సార్లు ఈ-ఆక్షన్‌ను నిర్వహించినప్పటికీ సరైన స్పందన రాకపోవడం రిజర్వు ధర కన్నా తక్కువకు విక్రయించాలని ప్రయత్నించినా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నిబంధనలకు అనుగుణంగా గడువును పెంచారు.

Updated Date - 2020-12-04T12:05:31+05:30 IST