Abn logo
Oct 23 2021 @ 00:53AM

‘భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి’

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు

నిర్మల్‌టౌన్‌, అక్టోబరు 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి లిఫ్ట్‌ఇరిగేషన్‌ టీమ్‌ప్యాకేజీ నెంబర్‌27కు సంబంధించిన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ... భూసేకరణకు సంబంధించిన అంశంపై ప్యాకేజీ నెంబర్‌ 27 ద్వారా పంప్‌ హౌజ్‌, పైప్‌ లైన్‌  కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదలశాఖ ఈఈ రామారావు, డీఈ జగదీష్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్రవంతి, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.