భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-01-25T05:17:21+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకు ర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆ ర్డీవోలను ఆదేశించారు.

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


నాగర్‌కర్నూల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):  పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకు ర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆర్డీవోలను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్‌ తన చాంబర్‌లో భూసేకరణ, ధరణి పెండింగ్‌ అంశాలపై ఆర్డీవోలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి ఏఏ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ భూసేకరణ మిగిలి ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇప్పటికే సమ్మతి తెలిపిన భూసేకరణకు సంబంధించి వారి బ్యాంక్‌ వివరాలు సేకరించి బిల్లులు చెల్లింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ముం పు నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉందో అట్టి గ్రామాల కమిటీలతో సమా వేశం నిర్వహించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా మాట్లాడాల న్నారు. ధరణిపై సమీక్షిస్తూ మ్యుటేషన్‌, సక్సేషన్‌, కోర్టు సమాచారం వంటి కేసులను సత్వరంగా పరిష్కరించే విధంగా తహసీల్దార్లతో మాట్లాడాలని ఆర్డీవోలకు సూ చించారు. ప్రతీ సోమవారం సాయంత్రం ధరణిపై సమీక్ష నిర్వహిస్తామని, ధరణి ఫిర్యాదు నమోదైన వారం రోజుల్లో వాటిని పరిష్కరించే విధంగా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమానాయక్‌, పాండునాయక్‌, రాజేష్‌కుమార్‌, ఏవో శ్రీనివాసులు, భూసేకరణ సూపరిం డెంట్‌ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-25T05:17:21+05:30 IST