రాచపల్లి రెవెన్యూలో 300 ఎకరాల భూమి ఆక్రమణ

ABN , First Publish Date - 2020-12-05T04:56:09+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ రాణి అమ్మాజీ తెలిపారు.

రాచపల్లి రెవెన్యూలో 300 ఎకరాల భూమి ఆక్రమణ
ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ అమ్మాజీ

  తహసీల్దార్‌ రాణి అమ్మాజీ

మాకవరపాలెం, డిసెంబరు 4 : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ రాణి అమ్మాజీ తెలిపారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 737లో గల 1600 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించినట్టు అందిన సమాచారం మేరకు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరకన్నపాలెం, వెంకయ్యపాలెం, రామన్నపాలెం, చినరాచపల్లిలను ఆనుకుని ఉన్న సర్వే నంబరు 737లో సుమారు 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పలువురు ఆక్రమించి అనుభవిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆక్రమణదారుల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్‌ఐ నరేంద్ర, మండల సర్వేయర్‌ గోవిందరావు, వీఆర్‌వో కన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T04:56:09+05:30 IST