ఆక్రమణలకు అడ్డు.. ల్యాండ్‌బ్యాంక్‌ యాప్‌

ABN , First Publish Date - 2021-01-18T07:01:48+05:30 IST

జిల్లా పరిధిలో ప్రభుత్వ భూములు ఎన్ని,

ఆక్రమణలకు అడ్డు.. ల్యాండ్‌బ్యాంక్‌ యాప్‌

అందుబాటులోకి తీసుకొచ్చిన కలెక్టర్‌ 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో ప్రభుత్వ భూములు ఎన్ని, ఆక్రమణలు ఎన్ని, ప్రభుత్వపరంగా వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యల వంటి వివరాలన్నింటినీ ఒకేచోట పొందుపరిచేందుకు కలెక్టర్‌ శ్వేతామహంతి ప్రత్యేకంగా ‘ల్యాండ్‌ బ్యాంక్‌ యాప్‌’ను అం దుబాటులోకి తీసుకొచ్చారు. మండలాల వారీగా తహసీ ల్దార్ల నేతృత్వంలో నలుగురు సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి, స్థలాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల వెంట నిర్మానాలు చేపడుతున్న వారిపై కేసులు పెడుతున్నారు. భూములు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్‌, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. 16 మండలాల్లో 250 వరకు ప్రభుత్వ స్థలాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, ప్రభు త్వ భవనాల నిర్మాణాల కోసం సర్కారు స్థలాలు తగ్గిపోయాయి. ప్రైవేట్‌ వ్యక్తుల ఆక్రమణలతో మరికొన్ని మాయం అయ్యాయి. ప్రభుత్వ భూములను రక్షించడమే లక్ష్యంగా ల్యాండ్‌బ్యాంక్‌ యాప్‌లో వివరాలు పొందుపరుస్తున్నారు.  

Updated Date - 2021-01-18T07:01:48+05:30 IST