Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాకరాపల్లిలో భూ ఆక్రమణ


 అఽధికార పార్టీ నాయకులు కబ్జా చేసినట్టు ఫిర్యాదులు.. పట్టించుకోని అధికారులు

మునగపాక, నవంబరు 28: మండలంలోని కాకరాపల్లిలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, మరో నాయకుడు సుమారు ఎనభై లక్షల రూపాయల విలువైన భూమిని ఆక్రమించినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ వారిలో స్పందన  కానరాలేదు.  కాకరాపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 230లో ప్రభుత్వ కాలువ, గ్రామ కంఠ భూమిని, కొండగెడ్డ ప్రాంతాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, మరో నాయకుడు తమ భూమిలోకి కలుపుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ ఆక్రమణపై రిటైర్డు ఆర్మీ ఉద్యోగి కాకి వీరవెంకటేశ్వర్లు, గ్రామానికి చెందిన పలువురు స్పందనలో రెవెన్యూ సిబ్బందికి, పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. ఫిర్యాదు చేసి సుమారు ఐదు నెలలు గడిచినప్పటికీ చలనం లేకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ విషయమై సచివాలయం కార్యదర్శి కోటేశ్వరరావును వివరణ కోరగా, ఆక్రమణపై ఫిర్యాదు వచ్చినట్టు చెప్పారు. ఈ భూమి సర్వే చేయించేందుకు సర్వేయర్‌ అందుబాటులో లేనందున జాప్యం జరుగుతున్నట్టు చెప్పారు.

Advertisement
Advertisement