పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-08-02T03:41:40+05:30 IST

పోడు భూముల సమ స్యను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్‌, సలేంద్ర సత్య నారాయణ, కంది శ్రీనివాస్‌లు తెలిపారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవే ర్చిన దాఖలాలు లేవన్నారు.

పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి
పోస్టర్‌ విడుదల చేస్తున్న సీపీఐ నాయకులు

మందమర్రిటౌన్‌, ఆగస్టు 1: పోడు భూముల సమ స్యను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్‌, సలేంద్ర సత్య నారాయణ, కంది శ్రీనివాస్‌లు తెలిపారు. ఆదివారం  సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవే ర్చిన దాఖలాలు లేవన్నారు.  పోడు భూములు సాగు చేసుకుంటున్న వారిపై అటవీ, పోలీసు శాఖల దాడు లు పెరిగిపోయాయన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో ఆసిఫా బాద్‌ జిల్లా జోడేఘాట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభ మవుతుందన్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని దళితులందరికి అందజేయాలన్నారు. సోంశెట్టి రాజేశం తదితరులు పాల్గొన్నారు. 

తాండూర్‌: పోడు భూముల సమస్యలపై ఈనెల 4 నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చేపడు తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మామిడాల రాజేష్‌ కోరారు. పోడుయాత్రకు సంబంధించిన గోడప్రతులను తాం డూర్‌ ఐబీలో విడుదల చేశారు. హరితహారం పేరుతో  పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రైతులపై కేసులు పెడుతున్నారన్నారు.  కొండు బానేష్‌, సాలి గాం సంతోష్‌, వైనాల సారయ్య, శివరావు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం పోడుయాత్ర పోస్టర్లను సీపీఐ నాయకులు విడుదల చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ పోడుయాత్ర ఈనెల 4న జోడేఘాట్‌లో ప్రారంభమై 8వ తేదీన భద్రాచలం చేరుకుంటుందని తెలిపారు. గిరిజన రైతు లు, మేధావులు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పూర్ణిమ, గుండ సరోజ, మాణిక్యం,  లక్ష్మీనారాయణ, రాజమొగిలి, శంకర్‌,  పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-02T03:41:40+05:30 IST