‘రియల్‌’ చిక్కు

ABN , First Publish Date - 2020-12-05T04:48:10+05:30 IST

కేసరి సముద్రం చెరువు శిఖం భూములను దురాక్రమణ చేసి కో ర్టు కేసులను ఎదుర్కొంటున్న రియల్‌ మాఫియాతో కందనూలు వాసులకూ ముప్పు ఏర్పడింది.

‘రియల్‌’ చిక్కు
కేసరి సముద్రం నిర్మాణం జరగక ముందే ఉన్న పురాతన ఇళ్లు

- కబ్జాదారుల దెబ్బతో పాత కందనూలుకు ముప్పు

- 400 ఏళ్ల కిందటి ఇళ్లకు రెవెన్యూ శాఖ నోటీసులు 

- లబోదిబోమంటున్న కందనూలువాసులు


నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కేసరి సముద్రం చెరువు శిఖం భూములను దురాక్రమణ చేసి కో ర్టు కేసులను ఎదుర్కొంటున్న రియల్‌ మాఫియాతో కందనూలు వాసులకూ ముప్పు ఏర్పడింది. రియల్‌ మాఫియా ఆగడాలను పెంచి పోషించడం కారణం గా నాలుగు శతాబ్దాల నుంచి స్థిర నివా సాల్లో ఉంటున్న వారంతా బెంబేలెత్తా ల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, కొందరు రియల్‌ వ్యాపారులు తాము చే సిన కబ్జాల నుంచి బయటపడటంతో పాటు సమస్యను పక్కదారి పట్టించడాని కి కూడా పావులు కదిపినట్లు తెలుస్తోం ది. ఈ క్రమంలో వస్తున్న ఒత్తిళ్లతో అ ధికారులు కూడా సతమతమవుతున్న ప రిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. 


400 ఏళ్ల కట్టడాలు


కేసరి సముద్రం ఎగువ భాగంలో నాలుగు శతాబ్దాల కిందటే ఆవాసాలు న్నాయి. నాగనవోలు, కందనవోలుగా ప్ర సిద్ధి చెందిన నాగర్‌కర్నూల్‌కు ప్రాచీన చరిత్ర ఉంది. బ్రిటిష్‌ పాలన నుంచి మొ దలుకొని నైజాం జమానా దాకా జిల్లా కేంద్రంగా కొనసాగిన నాగర్‌కర్నూల్‌లో సంతబజార్‌, ఈదమ్మగుడి, అరబ్‌గేరీ చుట్టూ ప్రజావాసాలున్నాయి. దాదాపు 400 సంవత్సరాల కిందటే ఊరికి సంబం ధించిన అనేక చారిత్రక శాసనాలు, చరి త్ర కూడా లభ్యం అయ్యాయి.


రియల్‌ మాఫియాతో ముప్పు


కందనూలు (నాగర్‌కర్నూల్‌) విభిన్న మతాలు, కులాల మధ్య సమైక్యతకు ప్ర తిరూపంగా నిలిచింది. అయితే, వీరి జీవి తాల్లో రియల్‌ మాఫియా చిచ్చురేపింది. కేసరి సముద్రం ఎగువ నాలుగు శతాబ్దా ల కిందటే నిర్మాణాలు జరిగాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాగర్‌క ర్నూల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో రి యల్‌ దందా జోరందుకుంది. ఈ నేప థ్యంలో భూముల ధరలు కూడా పెరిగా యి. దీంతో కేసరి సముద్రం దిగువ భా గంలో రియల్‌ మాఫియా శిఖం భూమి ని కబ్జా చేసి విలాసవంతమైన భవనాల ను నిర్మించింది. అలాగే చెరువు ఎఫ్‌టీఎ ల్‌, బఫర్‌ జోన్లలో ట్రాక్టర్ల ద్వారా వేలాది ట్రిప్పుల మట్టిని నింపి చెరువు విస్తీర్ణాన్ని కుదించింది. ఈ కారణంగా అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు ఎఫ్‌టీఎల్‌, బ ఫర్‌ జోన్లలో లేని ఇళ్లల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యు నల్‌లో కూడా కేసు నమోదైంది. ఈ త రుణంలో 400 ఏళ్ల కిందట నిర్మించిన ఇ ళ్లకు కూడా నోటీసులు అందడంతో ప్రజ లు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2020-12-05T04:48:10+05:30 IST