భూముల లెక్క.. ఇక పక్కా

ABN , First Publish Date - 2021-02-22T05:07:40+05:30 IST

డిజిటల్‌ భూ సర్వే మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో భూములను డిజిటల్‌ సర్వే చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గత సెప్టెంబరులోనే చేపట్టాలని నిర్ణయించగా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. డిజిటల్‌ సర్వేకు టె ండర్లు పిలువాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రక్రి య ప్రారంభం కానుంది. హద్దులు, భూ రికార్డుల సమస్య లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుంది.

భూముల లెక్క.. ఇక పక్కా

త్వరలో డిజిటల్‌ భూ సర్వేకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం

ప్రతీ భూమికి కో ఆర్డినెన్స్‌

పూర్తైతే హద్దుల గొడవకు చెల్లు

త్వరలో కామారెడ్డి జిల్లా అంతటా కొనసాగనున్న భూ కొలతలు

జిల్లా భూవిస్తీర్ణం 9.3 లక్షల ఎకరాలు

5.24 లక్షల ఎకరాలలో సాగుభూమి

వివాదాలలో 4,634 ఎకరాల భూమి

కామారెడ్డి, ఫిబ్రవరి 21 (ఆంధ్ర జ్యోతి): డిజిటల్‌ భూ సర్వే మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో భూములను డిజిటల్‌ సర్వే చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గత సెప్టెంబరులోనే చేపట్టాలని నిర్ణయించగా.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. డిజిటల్‌ సర్వేకు టె ండర్లు పిలువాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రక్రి య ప్రారంభం కానుంది. హద్దులు, భూ రికార్డుల సమస్య లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుంది. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రశాంత వాతావరణంలో వ్యవ సాయం చేసుకునేలా భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు సబ్‌ డివిజన్లను చేసేందుకు చర్యలు చేపడుతుందో ఇ ప్పటికే భూ రికార్డుల నవికరణ పూర్తవగా కామారెడ్డి జి ల్లాలోని ప్రతీ ఇంచు భూమిని కొలిచి యజమాన్యానికి హద్దుల వివరాలు తెలియజేయనుంది. అయితే, మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ రికా ర్డుల ప్రక్షాళన పేరుతో సర్వే నిర్వహించింది. ఇందులో భాగ ంగా కామారెడ్డి జిల్లాలో 9.03 లక్షల ఎకరాలలో భూ విస్తీ ర్ణం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో వ్యవసాయ భూమి వి స్తీర్ణం 5,24,946 ఎకరాలలో ఉండగా.. వ్యవసాయేతర భూ ములు 44,321 ఎకరాలలో ఉన్నాయి. ప్రభుత్వ భూములు 3, 33,905 లక్షల ఎకరాలలో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అసై న్డ్‌మెంట్‌ భూములు 1,57,122 ఎకరాలలో, అటవీ భూములు 1,57,210 ఎకరాలలో, దేవాదాయశాఖ భూములు 1823 ఎకరాల లో, వక్ఫ్‌భూములు 1,090 ఎకరాలలో ఉన్నట్లు గుర్తించారు. జి ల్లాలో వివాదాలలో ఉన్న 4,634 ఎకరాలు పార్ట్‌ బీలో చేర్చారు.

దశాబ్దాల అనంతరం భూ సర్వే

నిజాంపాలకుల హయాంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి రికార్డుల్లో భద్రపరి చారు. సాగు, ప్రభుత్వ భూములు చెరువు లు, కుంటలు, రహదారులు అంతర్గత దా రులు, అటవీ భూములు, ఇళ్ల స్థలాలు వం టి వివరాలన్నీ సేకరించి పట్టాలలో భద్రపరి చారు. రైతు పేరు, విస్తీర్ణం, ప్రస్తుత సర్వే నెంబ ర్‌, గత సర్వే నెంబర్‌, భూమి విలువ , శిస్తు, సర్వే ఆ కారం, అందులో ఎముంది, బావి, కాలువ వంటి, భూముల లెక్కలు, టీపాన్‌ వంటి వాటిని నిర్వహించారు. అప్పటి నుంచి భూ ముల సర్వేగానీ, రికార్డుల నవీకరణగానీ జరగలేదు. దీంతో రికార్డు లను మాయం చేయడం, హద్దుల తొలగింపు కబ్జాలు యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. గత వివరాలకు ఇప్పటి వివరాలకు పొంతన లేకపోవడం భారి స్థాయిలో భూముల ఆక్రమణకు గురయ్యాయని స్పష్టం అవుతోంది. జిల్లాలో లక్షల ఎకరాలలోనే ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణకు గురైనట్లు గత రెండు సంవత్సరాల కిందట నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళనలోనూ స్పష్టమవుతోంది. తాజా ప్రకటనలతో ఆక్రమణల గుట్టు తేలనుందని అర్థమవుతోంది.

ఇక చిక్కులకు చెక్కు

సాగు భూములతో పాటు నివాస స్థలాలు ప్రతీ ఇంచు కొలుస్తా మని గతంలోనే సీఎం ప్రకటించగా జిల్లాలో అధిక సమస్యలు  పో లీసు స్టేషన్‌లు, సర్వే ల్యాండ్‌ రికార్డుల శాఖలకు ఈ దరఖాస్తులే ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా హద్దుల గొడవ సమూల నిర్మూ లనకు భూ సర్వే చేపట్టనున్నారు. కో ఆర్డినె న్స్‌ ఇవ్వనుండగా సీత్వార్‌ లేదా కాస్రా లే దా టీపాన్‌ వంటి వివరాలను సరిచూస్తు ప్రస్తుత సర్వే నంబర్‌లో ఏవైనా తప్పుగా నమోదయ్యాయా? విస్తీర్ణం తప్పుగా ఉం దా? వంటి వివరాలను కార్యాలయ స్థాయి లోనే గతంలోనే సరిచేశారు. సర్వేయర్‌ భూ మిని సర్వేచేస్తే సర్వేనంబర్‌కు సంబంధించిన హద్దులు మాత్రమే నిర్ణయించేది. ఆ సర్వే నెంబ ర్‌లో ఉన్న రైతుల భూ హద్దులు నిర్ణయించే అధికారం లేదు. తాజా భూ సర్వే ప్రకారం ప్రతీ పట్టాదారు భూమికి సర్వే నెంబర్‌ కేటాయించనున్నారని సమాచారం.

తేలనున్న ప్రభుత్వ భూముల లెక్క

 మూడేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల ప్రక్షాళన పేరు తో ప్రభుత్వం సర్వే నిర్వహించి ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో పా టు ఆ భూములకు సంబంధించి కొత్తపట్టాపాసు పుస్తకాలను ప్ర భుత్వం జారీ చేసింది. ఎందరు పట్టాదారులు మరణించారు? వ్య వసాయ, వ్యవసాయేతర భూమిగా మార్చినవాటి వివరాలు, సర్వే నెంబర్‌లో పట్టాదారు పేరు, ప్రస్తుత పట్టాదారులు ఎందరూ? స ర్వే నెంబర్‌లు భూ విస్తీర్ణం వివరాలు, ప్రభుత్వం ఎందరికి భూ ములు కేటాయించింది? వాటి పరిస్థితి అంటే విద్యాలయాలు, పరి శ్రమలు, భూముల అక్రమ వివరాలు ఇవ్వనింటికి సర్వే నెంబర్‌లు, భూ విస్తీర్ణం నమోదుచేశారు. ధరణి వెబ్‌సైట్‌కు అనుసంధానించా రు. రికార్డుల నవీకరణ ప్రకారం భూములను కొలిచి హద్దులు నిర్ణ యించనుండగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి తేలనుంది.

Updated Date - 2021-02-22T05:07:40+05:30 IST