ధరణికి తాళం

ABN , First Publish Date - 2020-09-19T09:53:16+05:30 IST

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చే వరకు ధరణి వెబ్‌సైట్‌ను మూసివేయడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు

ధరణికి తాళం

ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్‌లు 

కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు బ్రేక్‌

ఆగిపోయిన భూముల క్రయవిక్రయాలు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఊహించని దెబ్బ

తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ భూసమస్యలు మినహా ఇతర పనులు చేస్తున్న అధికారులు


నిజామాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చే వరకు ధరణి వెబ్‌సైట్‌ను మూసివేయడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూముల క్రయవిక్రయాలు జరగడం లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల కు సంబంధించిన కార్యక్ర మాలు నిర్వహించడం లేదు.  


ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. భూ సంబ ంధిత కార్యక్రమాలన్నీ నిలిపివేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజుల రూపంలో ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లు నిలిపి వేయడంతో ఆదాయం రావడం లేదు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 29 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధి లో ఎక్కువగా భూ సంబంధిత కార్యక్ర మాలు జరిగేవి. 


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త రెవెన్యూ చట్టం వస్తున్నందున భూసంబంధిత కార్యక్రమాలన్నిం టినీ నిలిపివేశారు. వీఆర్‌వోల వ్య వస్థ రద్దు కావడం వల్ల రికార్డుల న్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో భద్రపర్చారు. ప్రభుత్వ ఆదేశాలు స్ప ష్టంగా ఉండడం.. ధరణి వెబ్‌సైట్‌ను మూసి ఉంచడం వల్ల భూ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించడం లేదు. భూ దస్తావేజు లకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చూడటం లే దు. ధరణి వెబ్‌సైట్‌ లేకపోవడం కొత్తగా ఏమి చేసినా తమ ఉద్యోగానికి ఎసరు వచ్చే అవకాశం ఉండడంతో ఎవరూ వాటి వైపు చూడడం లేదు. మిగతా కార్య క్ర మాలు మాత్రం యాథావిధిగా చేస్తున్నారు. వీఆర్‌వోలు లేకున్నా మండల స్థాయిలో ఉన్న ఆర్‌ఐలు వీఆర్‌ఏలతో కలిసి పనులు చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి న కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్లను ఇస్తున్నారు. మీ-సేవ నుంచి దరఖాస్తులు రాగానే ఆగ్రామం పరిధిలో పరిశీలిస్తున్నారు.


ఒకటి రెండు రోజుల్లోనే ఈ సర్టి ఫికెట్లను అందిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకటించి వీఆర్‌వోల వ్యవస్థ రద్దు చేసి న తర్వాత ఒకటి, రెండు రోజులు ఈ కార్యక్రమాలు ని లిపివేసినా.. ఉన్నతాధికారుల అదేశాలతో మళ్లీ జారీ చేస్తున్నారు. వీఅర్‌వోల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత గ్రా మాలలో ఎంక్వైయిరీలను వీఆర్‌ఏలతో చేయిస్తూ ఈ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. భూ సంబంధిత కార్యక్రమాలు మాత్రం చేయడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కూడా నిలిచి పోయింది. కళ్యాణలక్ష్మి, షా దీము బారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్ర మాలను తహసీల్దార్‌లు నిర్వ హిస్తున్నారు. నివేదికలను ఆ ర్డీవోలకు పంపిస్తున్నారు.


రియల్‌ ఎస్టేట్‌పై ప్రభావం

జిల్లాలో భూముల రిజిస్ట్రేష న్లు నిలిచిపోవడంతో ఆ ప్రభా వం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్రం గా పడింది. లాక్‌డౌన్‌ తర్వాత ఇపుపడిప్పు డే పుంజుకుంటున్న ఈ రంగం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో మళ్లీ సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది. ప్లాట్లు, ఇతర భూముల అమ్మ కాలు జరగడం లేదు. రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం వల్ల కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నవారు రిజి స్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకేసారి రిజిస్ట్రేష న్లు నిలిపివేయడం వల్ల కొన్నవారు సైతం ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు భూములపై పె ట్టుబడి పెట్టి ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నా రు. లాక్‌డౌన్‌ తర్వాత భూములకు ఇప్పుడిప్పుడే కొద్దిగా ధర వస్తున్న సమయంలో రిజిస్ర్టేషన్లు నిలిపివేయడం తో తమకు నష్టం వస్తోందని భావిస్తున్నారు. కోట్ల రూ పాయలు భూములపై పెట్టుబడి పెట్టినందున భూ ముల క్రయవిక్రయాలు నిలిచిపోతే భారీ నష్టం వస్తుం దని ఆందోళన చెందుతున్నారు.


రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వగానే చేసే విధంగా భూములను అమ్మేందుకు ప్ర యత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని నిజామాబాద్‌ నగర ంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల పరిధిలో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలోని జాతీయ రహదారి వెంట కూడా వెం చర్లు పెద్దఎత్తున వెలిశాయి. కరోనా వైరస్‌ ప్రభావం వ ల్ల ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సంక్షోభంలో ప డిందని, రిజిస్ట్రేషన్లు ఆగడం వల్ల మరింత నష్టపోతు న్నామని నగరానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకటించగానే మళ్లీ పుం జుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలోని తహసీ ల్దార్‌ కార్యాలయాల్లో ఎలాంటి భూ సంబంధిత కార్యక్ర మాలు నిర్వహించడం లేదని రెవెన్యూ అధికారులు తె లిపారు. ప్రస్తుతం విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలలతో పాటు ఇతర పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొ త్త రెవెన్యూ చట్టం అమలులోకి రాగానే మళ్లీ భూ సం బంధిత కార్యాక్ర మాలు కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-09-19T09:53:16+05:30 IST