పోర్టు కోసం భూముల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-28T04:28:50+05:30 IST

రామాయపట్నం పోర్టుకు భూముల సమగ్ర సర్వేలో భాగంగా మండలంలోని రావూరు, సాలిపేట, మెండివారిపాలెం, మూర్తింపేట గ్రామాల్లోని భూములను జేసీ వెంకటమురళి బుధవారం పరిశీలించారు. రామాయపట్నం పోర్టు ఏర్పాట్లకు సంబంధించి గుడ్లూరు మండల పరిధిలోని ప్రధానంగా సాలిపేట, రావూరు, మెండివారిపాలెం, గ్రామాలల్లో ఉన్న సర్వేనెంబర్లు 11, 48, 51, 56, 57లో ప్రభుత్వభూముల్లో 22 ఎకరాల 43 సెంట్లు భూమిని పోర్టు నిర్వహణకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశామని, అందుకుగాను ఈ పాటికే ఆయా గ్రామాల్లోన్ని ప్రభుత్వ భూములను, కుంటలను, వాగులను పరిశీలించామని చెప్పారు.

పోర్టు కోసం భూముల పరిశీలన
రావూరులో ప్రభుత్వ భూముల మ్యాప్‌ను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ వెంటమురళి

గుడ్లూరు, అక్టోబరు 27 : రామాయపట్నం పోర్టుకు భూముల సమగ్ర సర్వేలో భాగంగా మండలంలోని రావూరు, సాలిపేట, మెండివారిపాలెం, మూర్తింపేట గ్రామాల్లోని భూములను జేసీ వెంకటమురళి బుధవారం పరిశీలించారు. రామాయపట్నం పోర్టు ఏర్పాట్లకు సంబంధించి గుడ్లూరు మండల పరిధిలోని ప్రధానంగా సాలిపేట, రావూరు, మెండివారిపాలెం, గ్రామాలల్లో ఉన్న సర్వేనెంబర్లు 11, 48, 51, 56, 57లో ప్రభుత్వభూముల్లో 22 ఎకరాల 43 సెంట్లు  భూమిని పోర్టు నిర్వహణకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశామని,  అందుకుగాను ఈ పాటికే ఆయా గ్రామాల్లోన్ని ప్రభుత్వ భూములను, కుంటలను, వాగులను  పరిశీలించామని చెప్పారు.  సర్వేల అనంతరం పోర్టు అధికారులకు ఆ  భూములను అప్పగిస్తామన్నారు. అలాగే ఆక్రమణలకు గురైన భూములను కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితా సింగ్‌, గుడ్లూరు ఇన్‌చార్జి తహసీల్దార్‌ నారాయణరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-28T04:28:50+05:30 IST