సమగ్ర భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి..

ABN , First Publish Date - 2021-12-08T05:19:33+05:30 IST

శాశ్వత భూ హక్కు-భూ రక్షకు సంబంధించి సమగ్ర భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌) సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

సమగ్ర భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి..
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

   జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
కాకినాడ సిటీ, డిసెంబరు 7: శాశ్వత భూ హక్కు-భూ రక్షకు సంబంధించి సమగ్ర భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌) సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష’పై మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో బిక్కవోలు, అనపర్తి, గండేపల్లి, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం మండలాల్లో భూ సర్వే ప్రగతిపై సమీక్షించారు. ఆయా మండలాల్లో ప్రస్తుత పరిస్థితి, పనులను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల తనిఖీ, గ్రౌండ్‌ ట్రూతింగ్‌, గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ, సర్వే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే బృందాల సంఖ్యను పెంచి, లక్ష్యాల మేరకు సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వేపై ప్రతీవారం సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో కీలకమైన వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్లకు సరైన మార్గనిర్దేశం చేస్తూ సర్వేలోని వివిధ దశలను పూర్తి చేయాలన్నారు. ఇందుకు ప్రతి రోజూ తహసీల్దార్లు మండల స్థాయిలో సమీక్షించాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్‌, సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.గోపాలకృష్ణ, వివిధ మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:19:33+05:30 IST