Abn logo
Jun 1 2020 @ 14:15PM

గుంటూరు: ఆక్రమణకు గురైన దళితుల భూములు

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. అచ్చంపేట మండలం కోనూరులో అధికార పార్టీ నేతలు భూఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు  పలు శాఖల అధికారులు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మీ భూములకు ఆధారాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి పంపిస్తానన్న తహశీల్దార్ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement