ఖాళీ కంచాలతో భాషా వలంటీర్లు నిరసన

ABN , First Publish Date - 2021-12-08T05:46:05+05:30 IST

తమను రెన్యువల్‌ చేయాలని కోరుతూ ఆదివాసీ భాషా వలంటీర్‌లు మంగళవారం ఖాళీ కంచాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఖాళీ కంచాలతో భాషా వలంటీర్లు నిరసన
భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న భాషా వలంటీర్లు

వెంటనే రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌


పాడేరురూరల్‌, డిసెంబరు 7: తమను రెన్యువల్‌ చేయాలని కోరుతూ ఆదివాసీ భాషా వలంటీర్‌లు మంగళవారం ఖాళీ కంచాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ, మన్యంలో విద్యాప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఆదివాసీ భాషా వలంటీర్లను రోడ్డున పడేయడం ప్రభుత్వానికి తగదన్నారు. భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయకపోవడంతో మారుమూల గ్రామాల్లో ప్రాథమిక విద్య కుంటుపడిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భాషా వలంటీర్‌లను రెన్యువల్‌ చేయాలని, బకాయివేతనాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.నర్సయ్య, భాషా వలంటీర్‌ల సంఘం నాయకులు చిట్టిబాబు, చిన్నారావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:46:05+05:30 IST