పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-12-23T18:04:16+05:30 IST

పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని లంకా దినకర్...

పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం: లంకా దినకర్

అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ఇళ్లకు కుళాయిలు, పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 2014 నాటికి 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ  చొరవతో, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ పట్టుదలతో 8,183 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం " జల్ జీవన్ మిషన్ " కింద గత మూడేళ్లలో రూ. 4,346 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 6వందల కోట్ల లోపేనని విమర్శించారు. పీఏంజీఏవై కింద కేంద్రం నిధులు ఇస్తున్నా గడిచిన రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేక పోవడం శోచనీయమని లంకా దినకర్ అన్నారు.

Updated Date - 2021-12-23T18:04:16+05:30 IST